EPFO Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎఫ్సీ) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరిధిలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్సీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ఆగస్టు 22న ప్రారంభం కానున్నది. అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 09. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్సీ).
మొత్తం ఖాళీలు: 80. (అన్ రిజర్వ్డ్ 29, ఈడబ్ల్యూఎస్ 08, ఓబీసీ 18, ఎస్సీ 15, ఎస్టీ 10).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంపెనీ లా, లేబర్ లాస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 2026, సెప్టెంబర్ 11 నాటికి 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 22.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 09.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ upsc.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 2.5 మార్కులు కేటాయించారు. తద్వారా రాత పరీక్ష మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత ఉంటుంది. ప్రశ్న వదిలేస్తే మార్కులు కోత ఉండదు.
సిలబస్
జనరల్ ఇంగ్లిష్: భాషపై పట్టు, పదజాలం, వ్యాకరణాన్ని పరీక్షించే ప్రశ్నలు.
భారతీయ సంస్కృతి, వారసత్వం, స్వాతంత్ర్య ఉద్యమం: జాతీయ ఉద్యమం, గాంధేయ పద్ధతులు, చారిత్రక పరిణామాలు.
భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక అభివృద్ధి, ప్రస్తుత పోకడలు, ద్రవ్య విధానాలు.
భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ: రాజ్యాంగ నిర్మాణం, చట్టాలు, పంచాయితీరాజ్, పబ్లిక్ పాలసీలు.
జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు: నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ పథకాలు.
ప్రాథమిక గణితం, స్టాటిస్టిక్స్, రీజనింగ్: అర్థమెటిక్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ.
కంప్యూటర్ పరిజ్ఞానం & జనరల్ సైన్స్: ప్రాథమిక కంప్యూటర్ అప్లికేషన్లు, సైన్స్ విశేషాలు.
లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్: పారిశ్రామిక సంబంధాలు, కార్మిక చట్టాలు, భారతదేశంలో సామాజిక భద్రత.
అకౌంటెన్సీ, ఆడిటింగ్, ఇన్సూరెన్స్: ప్రాథమిక అకౌంటింగ్ సూత్రాలు, ఆడిటింగ్ నియమాలు, బీమా రంగ ప్రాథమిక అంశాలు.
ఇంటర్వ్యూ: రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్ / ఈడబ్ల్యూఎస్లు 50 మార్కులు, ఓబీసీ 45 మార్కులు, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు 40 మార్కులు పొందాల్సి ఉంటుంది.
వెయిటేజీ: తుది మెరిట్ జాబితా తయారీలో రాత పరీక్షకు 75 శాతం వెయిటేజీ ఉండగా, ఇంటర్వ్యూకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే రాత పరీక్ష మార్కులు 300కి, ఇంటర్వ్యూ మార్కులు 100కి కలిపి మొత్తం 400 మార్కులకు తుది ఫలితాలు వెల్లడిస్తారు.
