టోక్యో: స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ జపాన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో అల్కరాజ్ 5–7, 6–3, 6–1తో జౌమే మునార్ (స్పెయిన్)పై సంచలన విజయం సాధించాడు. తొలి సెట్‌లో 5–3 ఆధిక్యంలో ఉన్న దశలో సెట్ కోసం సర్వ్ చేసిన అల్కరాజ్ అనూహ్యంగా తడబడ్డాడు.
తొలి సెట్ ముగింపు, రెండో సెట్ ఆరంభంలో వరుసగా 16 పాయింట్లు కోల్పోయి వెనకబడ్డాడు. అయినప్పటికీ ఒత్తిడిని జయించిన ఈ వరల్డ్ మూడో నంబర్ ప్లేయర్ అద్భుతంగా పుంజుకున్నాడు. చివరి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 ఏస్‌లు, 4 డబుల్ ఫాల్ట్స్ చేసిన అల్కరాజ్ 6 బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు.
