యంగ్‌‌‌‌ పేసర్లకు పరీక్ష.. ఇవాళ (అక్టోబర్ 6) ఇండియా‌‌‌‌‌‌‌‌-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య తొలి వన్డే

యంగ్‌‌‌‌ పేసర్లకు పరీక్ష.. ఇవాళ (అక్టోబర్ 6) ఇండియా‌‌‌‌‌‌‌‌-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య తొలి వన్డే

పుదుచ్చెరి: ఆస్ట్రేలియా–ఎ జట్టుతో ఇండియా–ఎ టీమ్‌‌‌‌ మూడు మ్యాచ్‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే ఈ పోరులో ఇండియా యంగ్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ బౌలర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. సీనియర్‌‌‌‌ జట్టులో పేసర్ల కొరతను తీర్చే సత్తా తమకు ఉందని నిరూపించుకునేందుకు గుర్జాప్నిత్‌‌‌‌ సింగ్‌‌‌‌, అర్షద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, యశ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ సిద్ధమయ్యారు.

లిస్ట్‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌లో ఈ ముగ్గురికి మంచి రికార్డు కూడా ఉంది. అలాగే వన్డే ఫార్మాట్లలో ఈ త్రయం 6 కంటే తక్కువ ఎకానమీతో  బౌలింగ్ చేస్తోంది. కాబట్టి ఈ సిరీస్‌‌‌‌లోనూ సత్తా చాటితే టీమిండియాకు ఎంపికయ్యే చాన్సెస్‌‌‌‌ మరింత మెరుగవుతాయి. స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా రీ ఎంట్రీ ఇస్తాడని భావించినా.. కుడి మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్‌‌‌‌కు దూరమయ్యాడు. 

అతని స్థానంలో సూర్యాన్ష్‌‌‌‌ షెడ్జే జట్టులోకి వచ్చాడు. రుతురాజ్‌‌‌‌ కెప్టెన్సీలో దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపించేందుకు రెడీగా ఉన్నారు. న్యూజిలాండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు ముందు జరగనున్న ఈ సిరీస్ ద్వారా జాతీయ సెలెక్టర్లను ఆకర్షించాలని అటు పేసర్లు, ఇటు బ్యాటర్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే కివీస్‌‌‌‌ టూర్‌‌‌‌లో బుమ్రా మినహా మిగతా ప్లేస్‌‌‌‌లు చాలావరకు ఖాళీగా ఉన్నాయి.