కాంగో నదిలో రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి

కాంగో నదిలో రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి
  • ఈక్వేటర్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఘటన

కిన్షాసా: కాంగో నదిలో రెండు పడవలు ఢీకొని 30 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు గల్లంతయ్యారు. ఆదివారం ఈక్వేటర్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని న్గోంబే-లుకోలెలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ప్రావిన్షియల్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్పిన్ మ్పుటు వివరాలను వెల్లడించారు. మోటార్లతో నడిచే రెండు చెక్క పడవలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయని, ప్రమాదానికి కారణం తెలియరాలేదన్నారు. 

మృతులకు ఇప్పటికే స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. ఒక పడవ వాయువ్యంలోని ఉబాంగి నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తుండగా.. మరో పడవ కిన్షాసా నుంచి లుకోలెలాకు వెళ్తోంది. ఈ క్రమంలోనే రెండు పడవలు ఢీకొన్నాయని తెలిపారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.