హైదరాబాద్, వెలుగు: క్రికెటర్‌గా కెరీర్ కొనసాగించలేక, ఇతర రంగాల్లో స్థిరపడిన వారిలో క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన రెనోవా మాస్టర్స్ క్రికెట్ లీగ్ (ఎంఎస్‌ఎల్) ఈ నెల 7 నుంచి జరగనుంది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో సినీ నటుడు అలీ జ్యోతి ప్రజ్వలన చేసిన ట్రోఫీని ఆవిష్కరించాడు.
వివిధ కారణాలతో క్రికెట్ కెరీర్‌ను కొనసాగించలేని వారి కోసం ఈ లీగ్‌ను ఏర్పాటు చేసినట్లు మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్) ప్రెసిడెంట్ ఎస్పీ రెడ్డి వెల్లడించాడు. ఉపాధ్యక్షుడిగా ఉపేందర్ రెడ్డి, కార్యదర్శిగా సునీల్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా గువ్వల బాలరాజు, కోశాధికారిగా ఎస్. రాంబాబుతో పాటు ఈసీ సభ్యులుగా రమణ, రాకేష్, పవన్, సన్నీ వ్యవహరించనున్నారు. అనంతరం ఎంసీఏహెచ్ జెర్సీ, లోగోలను సభ్యులు ఆవిష్కరించారు.
