సముద్రంలో కూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్​ 

సముద్రంలో కూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్​ 

టోక్యో : జపాన్ ఆర్మీ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయినట్లు ఆ దేశ రక్షణ శాఖ శుక్రవారం వెల్లడించింది. జపాన్ దక్షిణ దీవుల్లో నిఘా ఆపరేషన్ కోసం ఆర్మీకి చెందిన యూహెచ్-60 బ్లాక్​హాక్ హెలికాప్టర్ వెళ్లిందని అధికారులు తెలిపారు. అందులో పదిమంది సిబ్బంది ఉన్నారని వివరించారు.

ఒకినావా ఐలాండ్ దగ్గర్లోని మియాకోజిమా ప్రాంతంలో హెలికాప్టర్ కూలినట్లు వివరించారు. టోక్యోకు నైరుతి దిశలో 1,120 మైళ్ల దూరంలో ఉన్న సముద్రంలో చాపర్ కు సంబంధించిన లైఫ్ బోట్, ఒక డోర్ దొరికిందన్నారు. ప్రమాదంలో గల్లంతైన సిబ్బంది కోసం వెతుకుతున్నామని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.