సిద్దిపేటలో ఉత్సాహంగా సాగిన హాఫ్ మారథాన్

సిద్దిపేటలో ఉత్సాహంగా సాగిన హాఫ్ మారథాన్

సిద్దిపేట హాఫ్ మారథాన్ మూడో ఎడిషన్ లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం  పట్టణ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించిన హాఫ్ మారథాన్ ను ఎంపీ రఘునందన్​రావు ప్రారంభించారు. దాదాపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి రెండు వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ చైతన్యవంతమవుతున్నారన్నారు. సూర్యుడితో పోటీ పడిలేచి పరిగెత్తే రన్నర్లు ఆరోగ్యంగా ఉంటారన్నారు. 

హఠాన్మరణాల సంఖ్యను తగ్గించుకోవాలంటే ఇలాంటి మారథాన్ పోటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదానికి  ప్రతి ఒక్కరు అండగా నిలవాలంటే ఇలాంటీ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా 5కె , 10కె, 21 కె విభాగాల్లో ని విజేతలకు బహుమతులను అందజేశారు.  - సిద్దిపేట, వెలుగు