భోజన ప్రియులకు హెచ్చరిక.. బావర్చి హోటల్ చికెన్ బిర్యానీలో బల్లి

భోజన ప్రియులకు హెచ్చరిక.. బావర్చి హోటల్ చికెన్ బిర్యానీలో బల్లి

మీరు బిర్యానీ ప్రియులా..? అయితే.. ఈ న్యూస్ మీ కోసమే.. మీకు ఎంతో ఇష్టమైన బిర్యానీని లొట్టలేసుకుని తినే ముందు ఈ విషయాన్ని గుర్తించుకోండి ఒకసారి. లేదంటే ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిందే.. 

బిర్యానీ అంటే ఎవ్వరికైనా ఇష్టమే.. ఇక హైదరాబాద్ బిర్యానీ.. అంటే నాన్ వెజ్ ప్రియులెవరైనా లొట్టలేసుకుంటూ తింటారు.. హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో లేకపోతే ఆర్డర్ ఇచ్చి మరి తెప్పించుకుంటారు.. 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే బావర్చి హోటల్ చికెన్, మటన్ బిర్యానీకి చాలా ఫేమస్. తాజాగా బావర్చి హోటల్ నుంచి తెప్పించుకున్న  చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైందని ఒక కస్టమర్ ఆందోళనకు దిగాడు. 

అంబర్ పేట డీడీ కాలనీకి చెందిన విశ్వ ఆదిత్య అనే వ్యక్తి.. ఆన్ లైన్ లో జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.  జొమాటో బాయ్ తీసుకువచ్చిన చికెన్ బిర్యానిలో బల్లి వచ్చిందని విశ్వ ఆదిత్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఇదే విషయాన్ని బావర్చి యాజమాన్యానికి తెలియజేశారు. అయితే.. బావర్చి యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ ఆ హోటల్ ముందు ఆందోళనకు దిగారు.