అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం

అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 21వ తేదీ అర్థరాత్రి లక్నో-గోరఖ్‌పూర్‌ జాతీయ రహదారిపై ప్యాసింజర్‌ బస్సును, ట్రక్కు ఢీకొట్దింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  5 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో బస్సు నుజ్జునుజ్జవ్వడంతో గాయపడినవారిని బస్సులో నుంచి బయటకు తీయడానికి సహాయక సిబ్బందికి ఇబ్బందిగా మారింది. 

ప్రైవేట్‌ బస్సు లక్నో-గోరఖ్‌ పూర్‌ హైవేపై అంబేద్కర్‌ నగర్‌ వైపు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకుంటుండగా... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని ఆయోధ్య చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అజరు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రక్కు బస్సు పై పడి నుజ్జునుజ్జయిందన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్య నాథ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు  సీఎంఓ  ట్వీట్‌ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని  జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.