
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని.. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని చెప్పారు. ఇక మన దేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు. ‘‘ఆదివారం రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది” అని పేర్కొన్నారు.