బాజా భజంత్రీలతో పెంపుడు కుక్కల పెళ్లి

బాజా భజంత్రీలతో పెంపుడు కుక్కల పెళ్లి

ఉత్తరప్రదేశ్‭లోని అలీఘర్‭లో విచిత్ర సంఘటన జరిగింది. అలీఘర్‭కు చెందిన కొందరు పెంపుడు కుక్కలకు పెళ్లి చేశారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వాటికి వివాహం చేశారు. రెండు పెంపుడు కుక్కలు ఆడ కుక్క పేరు జైలీ, మగ కుక్క టామీలను పక్కపక్కన కూర్చొబెట్టి వివాహ తంతును ముగించారు. బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్లతో గ్రాండ్‌గా చేశారు. ఈ వివాహానికి బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. నిజమైన మనుషులకు చేసినట్లే.. వీటి యజమానులు ఇద్దరూ మాట్లాడుకుని ఈ వేడుకను జరిపారు.  పెళ్లికి వచ్చిన బంధువులు డీజే చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.