
ఖైరతాబాద్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దూకిన వ్యక్తిని చూసి స్థానిక పోలీస్ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యాడు. అక్కడున్న వారిని అతను అలర్ట్ చేయడంతో ట్యాంక్ బండ్ లోపలికి దిగి దూకిన వ్యక్తిని కాపాడారు. అనంతరం అంబులెన్స్ లో అతన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అతన్ని ఆరోగ్యం నిలకడగా ఉంది. దూకిన వ్యక్తి వివరాలు, అతను ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడో తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.