హైదరాబాద్ రోడ్డుపై నడుస్తూ.. కుప్పకూలి చనిపోయిన వ్యక్తి

హైదరాబాద్ రోడ్డుపై నడుస్తూ.. కుప్పకూలి చనిపోయిన వ్యక్తి

ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు.. అవును ఈ కాలంలో ఇలాగే జరుగుతుంది. ఏ మనిషికి ఎప్పుడు.. చావు ఏ రూపంలో వస్తుందో తెలియటం లేదు. నిక్షేపంగా నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి.. ఒక్కసారి కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే అప్పటికే చనిపోయాడు. ముందూ వెనకా వెళుతున్న వారు షాకయ్యారు.. హైదరాబాద్ సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది. 

కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కిషోర్ కిషన్ అనే వ్యక్తి.. ఓ ఫార్మా కంపెనీలో ఆఫీస్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. 2024, మార్చి 19వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. రాజేంద్రనగర్ ఏరియాలోని డైరీ ఫార్మ్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళుతున్నాడు. రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో తీవ్ర గుండెపోటుతో.. రోడ్డుపై కుప్పకూలిపోయాడు.  

కిషోర్ కిషన్ సృహ తప్పి పడిపోయడేమో అని అతని లేపేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. ఎంతకీ కిషోర్ సృహ లోకి  రాకపోవడంతో ఇదేమైనా గుండెపోటు కావచ్చు అని  సీపీఆర్ అందించి బ్రతికించే ప్రయత్నం కూడా చేశారు.  అప్పటికే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.  కాసేపటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది కిషోర్ చనిపోయినట్లుగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిషోర్ కిషన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.