హైదరాబాద్ మాదాపూర్ లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ ఆరో ఫ్లోర్ నుంచి పడి సాయి చనిపోయాడు. మృతుడిది అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న సాయి... ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు.
ఓయో రూంలో నలుగురు ఫ్రెండ్స్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయిది ఆత్మహత్యా? లేదంటే ఎవరైనా కావాలనే పైనుంచి తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
