
కామారెడ్డి జిల్లా: ఈతకెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజాంసాగర్ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన రాములు(35) ఆదివారం మధ్యాహ్నం చెరువులో ఈతకెళ్లాడని స్థానికులు తెలిపారు. అయితే చాలా సేపు అతని ఆచూకి తెలియకపోవడంతో చెరువులో గాలించగా అవతలి ఒడ్డున రాములు మృతదేహం గుర్తించామన్నారు గ్రామస్థులు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.