ఫ్లైట్ దిగిన వ్యక్తికి గుండెపోటు.. హాస్పిటల్​కు తరలించేలోపే మృతి

ఫ్లైట్ దిగిన  వ్యక్తికి గుండెపోటు.. హాస్పిటల్​కు తరలించేలోపే మృతి

 శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో జార్ఖండ్‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్జీఐఏ పోలీసుల వివరాల ప్రకారం.. జార్ఖండ్​కు చెందిన ఆజాద్ (47) కుమార్తె కర్ణాటకలోని షాహీన్ యూనివర్సిటీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. 

కూతురును వర్సిటీకి పంపించేందుకు గురువారం రాత్రి రాంచి నుంచి ఇండిగో (6E-191) విమానంలో శంషాబాద్ కు వచ్చాడు. విమానం దిగిన తర్వాత అరైవల్ గేట్ నంబర్ 2 వద్దకు రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సమీపంలోని వ్యక్తులు వెంటనే సీపీఆర్ చేసి, బాధితుడిని విమానాశ్రయంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆజాద్ మృతి చెందినట్లు నిర్ధారించారు.