రైళ్లల్లో రద్దీ : జనరల్ బోగీల్లో నడవాలంటే సాహసం చేయాల్సిందే..

రైళ్లల్లో రద్దీ : జనరల్ బోగీల్లో నడవాలంటే సాహసం చేయాల్సిందే..

రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సార్లు రష్​ ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పు ఒంటికో, రెంటికో వస్తే మనం ఏం చేస్తాం. కొందరైతే తప్పక అందర్నీ తప్పించుకుని వెళ్లి పని కానిస్తారు. మరి కొందరైతే జనం తగ్గుతారని వేచి చూస్తుంటారు. అలాగే ఒక యువకుడికి అర్జంట్​గా టాయిలెట్​ వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్లో మాత్రం చీమ కూడా దూరనంత జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. దీంతో అతను టాయిలెట్​రూం కి చేరుకోవడానికి చిన్నపాటి సాహసమే చేయాల్సి వచ్చింది. అతను కూర్చున్న ప్లేస్​ నుంచి  బెర్త్​సీట్లపై ఒక్కొక్క అడుగు పెడుతూ.. దూకుతూ చివరికి గమ్యానికి చేరుకున్నాడు. అతను సీట్లను దాటుతున్న దృశ్యాల్ని కొందరు వీడియో తీసి,  బ్యాగ్రౌండ్​లో ఆదిపురుష్​సినిమాలోని పాటను ప్లే చేసి సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్​గా మారింది. 

నెటిజన్ల స్పందన..

ఆ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రజా రవాణాలో ఇలాంటి పరిస్థితులు ఉంటే పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కుంటారని, అధికారులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టి పబ్లిక్​ ట్రాన్స్ పోర్టేషన్​ని మెరుగుపరచాలని ఒకరు కోరారు. ఇండియాలో రైల్వేల పరిస్థితికి ఈ వీడియో నిదర్శనమని, జంతువులకన్నా దారుణంగా ఉందని మరొకరు ఘాటుగా వ్యాఖ్యానిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​ని ట్యాగ్​ చేశారు. ఇంకొకరు అతని స్పైడర్​ మ్యాన్​ అంటూ పొగిడారు.