బైక్ పై వెళ్తుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి.. షాద్ నగర్ నియోజకవర్గంలో ఘటన

బైక్ పై వెళ్తుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి.. షాద్ నగర్ నియోజకవర్గంలో ఘటన

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ అన్నమయ్య హోటల్​సమీపంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. షాద్​నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్​కు చెందిన మెహరాజ్ (41) స్థానికంగా గ్లాస్ వర్క్స్ చేస్తున్నాడు. గురువారం ఛాతీ నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. శుక్రవారం ఉదయానికి నొప్పి తగ్గడంతో యథావిధిగా పనిపై శంషాబాద్​కు బయలుదేరాడు.  బైక్​పై వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పడిపోయాడు. స్థానికులు సమీప హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.