కరెంట్ స్తంభం ఎక్కి.. వ్యక్తి సూసైడ్.. మేడ్చల్ లో ఘటన

కరెంట్ స్తంభం ఎక్కి.. వ్యక్తి సూసైడ్.. మేడ్చల్ లో ఘటన

మేడ్చల్, వెలుగు: హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్​షాక్​తో వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్ లోని ఎల్లంపేట కాసిం భాయ్ తండాలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి 12 కేవీ హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి చనిపోతానంటూ బెదిరించాడు. స్థానికులు ఎంత వారించినా వినకుండా కరెంట్ వైర్లను పట్టుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.