మోడీ వైపునకు దూసుకొచ్చిన వ్యక్తి అభిమానా..? ఆందోళనకారుడా..?

మోడీ వైపునకు దూసుకొచ్చిన వ్యక్తి అభిమానా..? ఆందోళనకారుడా..?

కర్నాటక రాష్ట్రంలోని దేవనగిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో లో ఓ వ్యక్తి దూసుకు రావడం కలకలం రేపింది. మోడీ రోడ్ షో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి ఉన్నట్టుండి భద్రతా దళాల కళ్లుగప్పి పరుగెత్తుకుంటూ వచ్చాడు. బారికేడ్లు దాడుకుని మోడీ వైపునకు దూసుకొచ్చాడు. ఊహించని పరిణామాతో భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే మోడీ భద్రతను పర్యవేక్షించే SPG బలగాలు పరుగెత్తుకుంటూ వెళ్లి సదరు వ్యక్తిని పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన దేవనగిరిలో బీజేపీ నిర్వహించిన రోడ్ షో లో జరిగింది. మోడీ వైపునకు పరుగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి కొప్పల్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. అయితే.. ఈయన మోడీ అభిమానా..? లేక ఇంకేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాడనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఏ ఉద్దేశంతో మోడీ కాన్వాయ్ వైపునకు వెళ్లాడనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.