కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి

కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి

ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. 

ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకుని.. ప్రమాదం జరిగిందని రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీ యాజమాన్యం చెబుతోంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.