బద్దలైన అగ్నిపర్వతం..20 కిలోమీటర్ల వరకు ఎగిసిపడ్డ బూడిద

బద్దలైన అగ్నిపర్వతం..20 కిలోమీటర్ల వరకు ఎగిసిపడ్డ బూడిద

దక్షిణ పసిఫిక్ సముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. దీంతో పొగ, బూడిద భారీగా ఎగిసిపడ్డాయి. సముద్ర గర్భం నుంచి బయటకొచ్చిన బూడిద 20 కిలోమీట్ల వరకు ఎగిసిపడినట్లు టోంగా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. అగ్నిపర్వతం పేలుడు శబ్ధాలు 8 నిమిషాల పాటు వినిపించినట్లు చెప్పారు. మరోవైపు పేలుడు ధాటికి సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో టోంగాతో పాటు.. జపాన్, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చిలీ సహా.. పశ్చిమ తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అగ్నిపర్వత విస్ఫోటనం..భూకంప తీవ్రతతో పోలిస్తే రిక్టర్ స్కేల్ పై 5.8గా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.