‘హాత్​ సే హాత్​ జోడో’ మీటింగ్​కు వెళ్లండి

‘హాత్​ సే హాత్​ జోడో’ మీటింగ్​కు వెళ్లండి

‘హాత్​ సే హాత్​ జోడో’ మీటింగ్​కు వెళ్లండి
సీనియర్​ నేతలకు ఖర్గే ఫోన్
ఇయ్యాల ఉదయం నుంచి సాయంత్రం దాకా శిక్షణ

హైదరాబాద్​, వెలుగు : భారత్​ జోడో యాత్రకు సమాంతరంగా గ్రామగ్రామాన కాంగ్రెస్​ ఆశయాలు,  సమస్యలపై పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తలపెట్టిన ‘హాత్​ సే హాత్​ జోడో అభియాన్​’ పై బోయిన్​పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్​లో మీటింగ్​ జరగనుంది. మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధరణి సమస్యలు, హాత్​ సే హాత్​ జోడో అభియాన్​ ఉద్దేశం, పార్టీ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​లు, మీడియా, సోషల్​ మీడియా, ఎలక్షన్​ కమిషన్​ లోటుపాట్లపై ఒక రోజు  శిక్షణ జరుగుతుందని కాంగ్రెస్​ నేతలు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సీనియర్​ కాంగ్రెస్​ నేతలందరూ హాజరు కావాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రతినిధులు ఫోన్​ చేసి కోరినట్లు తెలిసింది. ఇటీవల పీసీసీలోని సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో ఈ కాల్స్​కు ప్రాధాన్యత ఏర్పడింది. మెజారిటీ సీనియర్లంతా ఈ మీటింగ్​కు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శిక్షణ కార్యక్రమాల తర్వాత కాంగ్రెస్​ నేతలు ఆ సందేశాన్ని గడపగడపకు తీసుకెళ్లే వివిధ రకాల కార్యక్రమాలుంటాయని  పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ చామల కిరణ్​ మంగళవారం గాంధీభవన్​లో తెలిపారు.  

26 నుంచి పాదయాత్రలు : మహేశ్వర్​ రెడ్డి

హాత్​ సే హాత్ జోడో అభియాన్​లో భాగంగా ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు ఉంటా యని, వీటిని బ్లాక్​ స్థాయిలో చేపడతామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ మహేశ్వర్​ రెడ్డి తెలిపారు. అన్ని సెగ్మెంట్లలో 2 నెలల పాటు కార్యక్ర మాలు సాగుతాయన్నారు. చివరి యాత్ర హైదరాబాద్​లో జరుగుతుందని, దీనికి ఖర్గే లేదా రాహుల్​ హాజరవుతారన్నారు. మహిళల పాదయాత్రలో ప్రియాంకా పాల్గొంటారని చెప్పారు. రేవంత్​ పాదయాత్రపై, బుధవారం నాటి శిక్షణ తరగతులపై తనకు సమాచారం లేదని ఆయన తెలిపారు. రేవంత్​ యాత్రకు ఏఐసీసీ అనుమతి ఇచ్చిందో లేదో తెలియదని, ఇస్తే మాత్రం ముందుండి పని చేస్తానన్నారు.