
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బుధవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం సమయంలో సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సులా ఓ వలయం ఏర్పడింది. సూర్యుడి చుట్టూ ఇలా వలయం ఏర్పడడాన్ని ‘హాలోసన్’ అంటారని, ఎత్తైన మేఘాలలో ఉండే ఐస్ క్రిస్టల్స్‌కు సూర్యకిరణాలు తాకినప్పుడు ఇలా ఏర్పడుందని సైంటిస్ట్‌లు చెప్పారు. ఈ అరుదైన దృశ్యాన్ని పలువురు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.