
వేములవాడ, వెలుగు: తనను కొడుకులు పట్టించుకుంట లేరని.. ఇంట్లో నుంచి గెంటేశారని.. న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు వేములవాడ పట్టణంలో ప్లకార్డుతో బైఠాయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ కాలనీకి చెందిన నర్సవ్వకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నర్సవ్వ మున్సిపల్‌లో పారిశుధ్య కార్మికురాలు కావడంతో తన ఉద్యోగాన్ని ఎనిమిది నెలల క్రితం చిన్న కొడుక్కి ఇచ్చి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు కొడుకులు పట్టించుకుంటలేరని, కోడళ్లు బాధ పెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో నుంచి గెంటి వేశారని పేర్కొంది.