సూర్య..దుల్కర్ సల్మాన్ లతో.. డైరెక్టర్ సుధ కొంగర మల్టీస్టారర్

సూర్య..దుల్కర్ సల్మాన్ లతో.. డైరెక్టర్ సుధ కొంగర మల్టీస్టారర్

డైరెక్టర్ సుధ కొంగర డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన సూరరై పొట్రు.ఈ సినిమా అప్పట్లో వివిధ భాషల్లో విడుదలై ఎంత సక్సెస్ ను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలైన ఈ మూవీకి తెలుగులోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డైరెక్టర్ సుధ కొంగర మల్టీస్టారర్ మూవీ తీయడానికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.ఈ మల్టీస్టారర్ మూవీలో తమిళ స్టార్ హీరో సూర్య..మలయాళ సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఓ ప్రముఖ సంస్థ ముందుకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉండగా..తర్వాత డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్టులో జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం. సూర్య 43 టైటిల్‌గా వస్తోన్నఈ ప్రాజెక్ట్ లో దుల్కర్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.ఈ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్  డైరెక్టర్ జీవి ప్రకాష్ అద్దిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీ జీవి ప్రకాష్ కు 100వ మూవీ కావడంతో స్పెషల్ ట్యూన్స్ కంపొజిషన్ లో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.సుధ కొంగర తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోలీవుడ్ లోనే పెద్ద మల్టీస్టారర్ గా రాబోతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.   

సూర్య ప్రసెంట్ పాన్ వరల్డ్ మూవీ కంగువా(Kanguva) లో యాక్ట్ చేస్తున్నారు.డైరెక్టర్ శివ(Shiva) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations), స్టూడియో గ్రీన్(Studio green) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరో సూర్య డిఫరెంట్ లుక్ కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి.

ఇక కంగువా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది