పెండ్లి ఊరేగింపు అనగానే లగ్జరీ కార్లు, చెవులకు చిల్లులు పడే డీజే చప్పుళ్లు, కండ్లు జిగేల్‌మనే లేజర్ లైట్ల వాడకమే ప్రస్తుత ట్రెండ్. కానీ ఆధునిక హంగుల మోజులో పడి మూలాలను మరువొద్దు అనుకున్నారు ఓ నవజంట. దీంతో తమ రిసెప్షన్ బరాత్‌ను ఎడ్లబండి, సాధారణ డప్పుచప్పుళ్లతోనే జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో ఆదివారం సంజన, సాయిప్రసాద్ వివాహం జరిగింది. బుధవారం ఆదిలాబాద్‌లోని ఓ బాంకెట్‌హాల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వేడుక జరుపుకోవాలని భావించిన ఆ జంట ఎడ్లబండిపై, సాధారణ డప్పు చప్పుళ్ల మధ్య బరాత్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఆ బండిపైనే గ్రామం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంకెట్‌హాల్‌కు చేరుకున్నారు. పాత తరం పద్ధతిలో ఎడ్లబండిపై రిసెప్షన్ ఊరేగింపును నిర్వహించుకున్న దంపతులను పలువురు అభినందించారు.
