Stree 2 Box Office Collection: మూడవ వారంలోను స్త్రీ 2 వసూళ్ల సునామి..కల్కి 2898AD లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ బ్రేక్

Stree 2 Box Office Collection: మూడవ వారంలోను స్త్రీ 2 వసూళ్ల సునామి..కల్కి 2898AD లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ బ్రేక్

శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్‌‌‌‌‌‌‌‌ రావ్‌‌‌‌ నటించిన స్త్రీ 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ఆగస్ట్ 15న రిలీజైన ఈ మూవీ..థియేటర్లోకి వచ్చి రెండు వారాలు కావొస్తున్న వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. విడుదలైన 16వ రోజున ఈ సినిమా ఇండియా వైడ్ గా రూ. 8.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమా దేశీయంగా మొత్తం రూ.441.3 కోట్ల డొమెస్టిక్ నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. 

స్త్రీ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఈ ఏడాది (2024) లో వచ్చిన ప్రభాస్ కల్కి 2898AD ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా..ఆ తర్వాత కలెక్షన్స్ పరంగా, టాక్ పరంగా స్త్రీ 2 మూవీ రెండవ అతిపెద్ద బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.ఇక ఒరిజినల్ హిందీ చిత్రాల పరంగా ఇప్పటికే పలు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను సైతం బీట్ చేసింది. 

ప్రభాస్ కల్కి 2898AD హిందీ బెల్ట్ లైఫ్ లాంగ్ కలెక్షన్స్ అయిన రూ.291.13 కోట్లను..తాజాగా స్త్రీ2 మూవీ బ్రేక్ చేసింది. ఇప్పుడు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ హిందీ లాంగ్ రన్ గ్రాస్ కలెక్షన్స్ అయిన రూ.662.33 కోట్లపై కన్నేసి వసూళ్ల సునామి కొనసాగిస్తోంది. ఈ వీకెండ్ లో ఆ టార్గెట్ కూడా పూర్తి చేయనుంది.  

అయితే, ప్రస్తుతం బాలీవుడ్ నాట ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో..స్త్రీ 2కి మరిన్ని కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఎందుకంటే, ఈ మూవీ మూడవ శుక్రవారం (ఆగస్ట్ 30న) ఇండియా అంతటా 4000 షోలు పడింది. ఇక దీన్ని బట్టి అర్ధం చేసుకోవొచ్చు. ఏ రేంజ్ లో దూసుకెళ్తోందని. 2018లో వచ్చిన 'స్త్రీ' మూవీకి ఇది సీక్వెల్. స్త్రీ పార్ట్ 1 రూ.100 కోట్లు సాధించింది.