Saripodhaa Sanivaaram Box Office: సరిపోదా శనివారం 2 డేస్ కలెక్షన్స్ ఇవే..నాని హిట్ కొట్టాలంటే ఇంకెంత రావాలి?

Saripodhaa Sanivaaram Box Office: సరిపోదా శనివారం 2 డేస్ కలెక్షన్స్ ఇవే..నాని హిట్ కొట్టాలంటే ఇంకెంత రావాలి?

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తెరకెక్కించిన ఈ సినిమా గురువారం (ఆగస్ట్ 29న) తెలుగుతో పాటు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలలో రిలీజయింది.

భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే, ఈ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయింది. కానీ, రెండో రోజు ఆగస్ట్ 30న మాత్రం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. 

ఫస్ట్ డే కలెక్షన్స్:

సరిపోదా శనివారం మూవీకి ఇండియా వైడ్గా ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే..రూ.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 8.75 కోట్లు, తమిళం నుంచి రూ.24 లక్షలు, మలయాళంలో రూ.లక్షకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే ఫస్ట్ డే అయిన గురువారం (ఆగస్ట్ 29) తెలుగులో ఓవరాల్‌గా 53.54 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. 

Also Read :- నా అబ్బాయిలు మళ్లీ వచ్చారు

సెకండ్ డే కలెక్షన్స్: 

సెకండ్ డే కలెక్షన్స్ చూసుకుంటే..ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో కలిపి రూ.5.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది.అంటే, ఫస్ట్ దయతో పోల్చి చూస్తే..రెండో రోజు కలెక్షన్స్ రూ.3.25 కోట్ల వరకు పడిపోయాయి. దీంతో సరిపోదా శనివారం సినిమాకు ఇండియా వైడ్ గా రెండు రోజుల్లో రూ.14.75 కోట్ల నికర వసూళ్లు వచ్చాయి. అలాగే రెండో రోజుల తెలుగులో 39.34 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. వరల్డ్ వైడ్ గా చూస్తే..రూ.రూ.28.50 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

ఓవర్సీస్ కలెక్షన్స్:

అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చిందట. ప్రీమియర్స్, డే 1 కలెక్షన్స్ రెండు కలిపి ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి రూ.8 కోట్లకుపైగా గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 2 రోజుల ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకుంటే రూ.11.10 కోట్లు గా ఉంది.

ఇకపోతే సరిపోదా శనివారం మూవీకి ఫస్ట్ డే రూ.24.11 గ్రాస్ కలెక్షన్స్ రాగా..ఇక రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.అంటే, మరో రెండ్రోజుల్లో రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకోనుంది. 

బ్రేక్ ఈవెన్ టార్గెట్:

భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన సరిపోదా శనివారం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు చూసుకుంటే..ఓవరాల్‌గా రూ.41 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.42 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. దీన్ని బట్టి చూస్తే సరిపోదా శనివారం కమర్షియల్‌గా హిట్ కావాలంటే, అంటే నానికి మరో హిట్ పడాలంటే ఇంకా రూ.30 నుంచి 34 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.