బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్

బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్

ఎల్​బీనగర్,వెలుగు: బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్​ను హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం హయత్​నగర్ ఎక్సైజ్​స్టేషన్​లో ఇన్​స్పెక్టర్ లక్ష్మణ్​ కేసు వివరాలను వెల్లడించారు. నైజీరియాకు చెందిన గోడ్విన్ ఇఫిన్వి(32) స్టడీ వీసాపై ఇండియాకు వచ్చాడు. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలోని సాయికాంత్​నగర్​లో ఉండేవాడు.ఓ ఫార్మసీ కాలేజీలో ఎంప్లాయ్ గా చేస్తున్నట్లు ఫేక్ ఐడీ, ఆధార్ కార్డును పొందాడు.  స్టూడెంట్లను టార్గెట్ చేసి బెంగళూరు నుంచి కొకైన్​ను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు.  గతేడాది మే 22న దూల్ పేటలో   కొకైన్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ గోడ్విన్ జైలుకెళ్లి బెయిల్ పై రిలీజయ్యాడు. ఆ తర్వాత నుంచి గోడ్విన్ వనస్థలిపురంలో ఉంటూ కొకైన్ సప్లయ్ చేస్తున్నట్లు తెలుసుకున్న ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు. గోడ్విన్​ను అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు. అతడి దగ్గరి నుంచి 178 గ్రాముల కొకైన్,సెల్ ఫోన్, రూ.35 వేల క్యాష్​ స్వాధీనం చేసుకున్నారు.

బండ్లగూడ జాగీర్​లో గంజాయి సీజ్

గండిపేట: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హల్దర్ బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి బండ్లగూడ జాగీర్ ఏరియాలోని ఓ స్కూల్​లో 
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సొంతూరి నుంచి సిటీకి వచ్చేటప్పుడు తన వెంట కిలో గంజాయి తెచ్చుకున్నాడు. గంజాయికి బానిసైన హల్దర్ స్థానికులకు సైతం అమ్మడం మొదలుపెట్టాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.