నిర్మల్ జిల్లా మన్మద్ దగ్గర పోలీస్ వాహనం బీజేపీ కార్యకర్తలపైకి వెళ్లింది . వెంకటేశ్ అనే కార్యకర్త కాలుపైకి ఎక్కింది పోలీస్ వాహనం. బాసర IIIT విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఎంపీ సోయం బాపురావ్ ను అడ్డుకుని, అరెస్ట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీస్ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. వారిపైకి కారు నడిపించారు పోలీసులు. ఎంపీ సోయం బాపురావును లోకేశ్వరం పోలీస్టేషన్ కు తరలించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. అయితే నిరాహార దీక్ష చేస్తున్న E1, E2విద్యార్థులను ఆందోళన విరమించాలని స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్(SGC) పిలుపునిచ్చింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్న భోజనం చేయాలని SGC ప్రెసిడెంట్ మదేశ్ సూచించారు . సెలవుల తర్వాత అందరం కలిసి పోరాటం చేద్దామంటూ పిలుపునిచ్చారు.
సమస్యలు పరిష్కరించాలంటూ.. ట్రిపుల్ ఐటీ E1, E2 విద్యార్థులు రాత్రి నుంచి నిరసన చేస్తున్నారు. శనివారం రాత్రి భోజనం చేయకుండా తెల్లారి 3 గంటల వరకు మెస్ లో జాగారం చేశారు. ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఐదు డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో ఒకటైన మెస్ ఇష్యూపై వెంటనే స్పందించి.. మెస్ టెండర్లు పిలిచారు. మిగితా 4 డిమాండ్లపై నిలదీస్తున్నారు విద్యార్థులు.
