వేస్ట్ బ్యాచ్.. వారం రోజుల్లోనే రూ. 100 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'వజా 2' దూకుడు!

వేస్ట్ బ్యాచ్.. వారం రోజుల్లోనే రూ. 100 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'వజా 2' దూకుడు!

చిన్న సినిమా అయినా కథ ఉంటే చాలు  హీరోలతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడతారు సినీ ప్రియులు. ఇదే కోవలో ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమ తన మేకింగ్ స్టైల్ తో భారతీయ సినిమా రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.  భారీ బడ్జెట్‌లు, భారీ తారాగణం లేకపోయినా, కేవలం బలమైన కథా బలంతో బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేయవచ్చో చూపిస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన  ‘వజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రదర్స్’ నిరూపించింది.  మొదటి భాగం ‘వజా’ కంటే మిన్నగా, ఈ సీక్వెల్ రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

కథా నేపథ్యం..

దర్శకుడు నవీన్ ఎస్.ఏ తెరకెక్కించిన యూత్ ఫుల్ డ్రామా 'వజా 2' . ఇది హషీర్, అలన్, అజిన్ , వినాయక్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. పాఠశాల రోజుల్లో ‘వేస్ట్ బ్యాచ్’, ‘లూజర్స్’ అని ముద్ర వేయించుకున్న ఈ కుర్రాళ్లు, చదువు పూర్తయ్యాక సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి పడే తపనే ఈ సినిమా. కేవలం నలుగురు స్నేహితుల కథగానే కాకుండా, ప్రస్తుత తరం యువతకు ఉన్న ‘యూకే కలలు’, విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే ఆశలు, అక్కడ ఎదురయ్యే వాస్తవ పరిస్థితులను దర్శకుడు చాలా సహజంగా ఆవిష్కరించారు.

కామెడీ , ఎమోషన్..

ఈ సినిమా మూడు చాప్టర్లుగా సాగుతుంది. క్లీన్ కామెడీ, సింపుల్ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. ముఖ్యంగా థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న పోలీస్ స్టేషన్ సీన్ , థియేటర్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. కేవలం స్నేహమే కాకుండా, తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధం, తల్లుల ప్రేమ, ప్రియురాలి అండ వంటి అంశాలను ఎక్కడా నాటకీయత లేకుండా చూపించారు. అంకిత్ మీనన్ అందించిన సంగీతం సినిమాలోని మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.

బాక్సాఫీస్ వద్ద దూకుడు..

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని రీతి దూసుకెళ్తోంది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టిస్తోంది.  సినీ ట్రెడ్ లెక్కల ప్రకారం ఇండియాలో రూ. 54.62 కోట్లు, విదేశాల్లో రూ. 48.90 కోట్ల మేర రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 103. 52 కోట్లను వసూళ్ల చేసింది. ఈ ప్రాజెక్టులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాహూ గారపాటి కూడా భాగస్వామి కావడం విశేషం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి పాఠమే?

మలయాళం మూవీతో పోల్చితే టాలీవుడ్ లో టైర్-2 హీరోలే ఏడాదికి ఒక సినిమా చేయడానికి తడబడుతుంటారు. కానీ అతి తక్కువ సమయంలో నాణ్యమైన సినిమాను సిద్ధం చేయడంలో మలయాళ మేకర్స్ సక్సెస్ అయ్యారు. బిజుకుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు వంటి నటులు తమ నటనతో సినిమాకు వెయిట్ తీసుకొచ్చారు.

ALSO READ : 'ధురంధర్ 2' కు కాపీరైట్ చిక్కులు..

ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో ‘వజా 2’ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. మొత్తానికి, ‘వజా 2’ కేవలం సినిమా మాత్రమే కాదు.. నేటి తరం యువత ప్రతిబింబం. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, కడుపుబ్బ నవ్వించే వినోదం కలగలిసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.