దుమారం రేపిన మియా ఖలీఫా ట్వీట్

దుమారం రేపిన మియా ఖలీఫా ట్వీట్
  • పాలస్తీనియన్లు ఫ్రీడమ్​ ఫైటర్స్​ 
  • అనడంపై మండిపడుతున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: మాజీ పోర్న్​స్టార్​ మియా ఖలీఫా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్​పై తీవ్ర దుమారం రేగుతోంది. ఇజ్రాయెల్-– పాలస్తీనా యుద్ధంపై ఆమె స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్​లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సరిగా కనిపించడం లేదు. వీడియోలు తీసేటపుడు ఫోన్లను నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకోమని పాలస్తీనా ఫ్రీడమ్ ఫైటర్లకు ఎవరైనా చెప్పండి.. ప్లీజ్’ అని ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు మియా ఖలీఫా తీరును తప్పుబడుతున్నారు. 

ఓవైపు జనం చనిపోతుంటే.. గాయాల పాలై ఆర్తనాదాలు చేస్తుంటే ఇలాంటి ట్వీట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖలీఫా ట్వీట్ వైరల్ కావడంతో ప్లేబాయ్  కంపెనీ అమెతో కుదుర్చుకున్న అగ్రిమెంట్​ను రద్దు చేసుకుంది. మరో కంపెనీ టోడ్ షపిరో ప్రతినిధి కూడా స్పందించాడు.

 ‘మీ ట్వీట్ నిజంగా భయంకరంగా ఉంది.. మీరు మానవత్వం ఉన్న మనిషిగా మారాలని మా కంపెనీ తరఫున కోరుకుంటున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మియా ఖలీఫాతో ఇక ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోబోమని స్పష్టం చేశారు. అయితే ఆ  కంపెనీలపై మియా ఖలీఫా కూడా ఘాటుగానే స్పందించింది.

 ‘పాలస్తీనాకు సపోర్ట్ చేయడం వల్ల బిజినెస్ పరంగా నష్టపోవడం కన్నా ఇలాంటి కంపెనీలతో నేను ఇంతకాలం పనిచేశాననే బాధే ఎక్కువగా ఉంది’ అని ఆమె తెలిపింది. తాను లెబనాన్ లో పుట్టి పెరిగానని, స్వాతంత్ర్యం కోసం పడే తపన ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పింది.