రాష్ట్రవ్యాప్తంగా లక్ష గాంధీ విగ్రహాల సేకరణ

రాష్ట్రవ్యాప్తంగా లక్ష గాంధీ విగ్రహాల సేకరణ
  • గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా కార్యక్రమం
  • గాంధీ భవన్‌‌లో బాపు బాట ప్రచార రథాన్ని ప్రారంభించిన పీసీసీ చీఫ్


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఒక అడుగు ఎత్తు ఉన్న లక్ష గాంధీ విగ్రహాలను సేకరించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా బుధవారం గాంధీ భవన్‌‌లో బాపు బాట ప్రచార రథాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జెండా ఊపి స్టార్ట్ చేశారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి సంఘీభావంగా ఈ ప్రోగ్రామ్‌‌ చేపడుతున్నట్లు ఈ సంస్థ చైర్మన్ రాజేందర్ రెడ్డి, కన్వీనర్ ప్రభాకర్‌‌‌‌ తెలిపారు. 

సేకరించిన ఈ విగ్రహాలను హైదరాబాద్‌‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల్లో ప్రతిష్టించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రచార రథం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో తిరిగి ఈ విగ్రహాలను సేకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను కూడా ప్రచారం చేస్తామన్నారు.