- ఢిల్లీకి బయలుదేరిన భీం మనవడు సొనేరావు
కాగజ్నగర్, వెలుగు : ఆదివాసీ అమరవీరుడు కుమ్రం భీం వారసుడికి అరుదైన గౌరవం దక్కింది. దేశానికి స్వాతంత్ర్య్ం వచ్చి 75 ఏండ్లు పూర్తయి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ పోరాట యోధులను సన్మానించాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. శనివారం రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కొమ్రం భీం మనమడు కుమ్రం సోనేరావును ఢిల్లీకి ఆహ్వానించింది. దీంతో గురువారం సోనేరావు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్లారు. అల్లూరి సీతారామరాజు వారసుడిని కూడా ఆహ్వానించడంతో ఇద్దరూ కలిసి ఒకే బోగీలో ప్రయాణించారు. అంతకుముందే కాగజ్ నగర్ అర్పీఎఫ్ఎస్ఐ ప్రాచీదేవి, అసిస్టెంట్ ఎస్ఐ లు ఎం.సురేశ్, నాగేశ్వర్రావు ఆయనను సన్మానించి రైలెక్కించారు. సోనేరావు మాట్లాడుతూ తనకు ఇది అరుదైన గౌరవమన్నారు.
