వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ తాగుతుంటారు చాలామంది. అయితే వాటికంటే ఒంటికి చలువ చేసే డ్రింక్స్ తాగితే హెల్త్ మంచిది. అందుకే ఈ సగ్గుబియ్యం సమ్మర్ డ్రింక్ రెసిపి తెచ్చేశాం.
కావాల్సినవి
- నీళ్లు- 4 కప్పులు,
- సగ్గుబియ్యం - అరకప్పు
- సబ్జా గింజలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- పాలు- 3 కప్పులు
- ఐస్ క్యూబ్స్ కొన్ని
- రోజ్ సిరప్ - పావు కప్పు
- కండెన్స్డ్ మిల్క్ -రెండు టేబుల్ స్పూన్లు
- తయారీ
గిన్నెలో నీళ్లు కాగబెట్టాలి. అందులో సగ్గు బియ్యం వేసి ఉడికించాలి. ఉడికించిన సగ్గుబియ్యాన్ని వడకట్టి గిన్నెలోకి తీయాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కా సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు, రోజ్ సిరప్, కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి, అందులో నానబెట్టిన సబ్జా గింజలు వేయాలి.
ఆ తరువాత పాల మిశ్రమాన్ని కూడా పోసి కలపాలి.. కావాలంటే ఇందులో జెల్లీ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సూపర్ మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ జెల్లీ పౌడర్ ని ఒక కప్పు వేడి నీళ్లలో వేసి కాసేపు చల్లార్చాలి. ఆ తర్వాత చాకుతో జెల్లీని ముక్కలుగా కోసి వేసుకుంటే సగ్గుబియ్యం సమ్మర్ డ్రింక్ రెడీ.
