ఓటర్లకు అలర్ట్.. ఎన్యుమరరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదు

ఓటర్లకు అలర్ట్.. ఎన్యుమరరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదు
  • ఎన్యుమరేషన్ ఫామ్‌‌‌‌ తిరిగి ఇవ్వకపోతే  ఓటు ఉండదు: 
  • జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు.. అందరికీ ఫారాలు పంపిణీ చేసినం: ఆర్వీ కర్ణన్‌‌‌‌
  • ఇల్లు మారిన, చనిపోయిన వారు 11,52,613 మంది  
  • 3,73,349 మంది ఆన్​లైన్​లో ఫామ్‌‌‌‌లు​ నింపిన్రు.. 
  • వీరు మాన్యువల్‌‌‌‌గా ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు
  • 23,75,121 మంది వివరాలు డిజిటలైజ్​ చేసినం
  • ఫామ్-6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటు పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే డ్రాఫ్ట్‌‌‌‌లో పేరు పోతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. స్పెషల్​ ఇంటెన్సివ్‌‌‌‌ రివిజన్‌‌‌‌ (సర్‌‌‌‌‌‌‌‌) ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫామ్‌‌‌‌లను తప్పనిసరిగా నింపి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌‌‌‌వో) తిరిగి అందించాలన్నారు.  బుధవారం జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో ఆర్వీ కర్ణన్‌‌‌‌ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫామ్‌‌‌‌లను తిరిగి సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు చివరి తేదీ ఉందన్నారు.  

జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 47,36,669 మంది ఓటర్లున్నారని,  ఎన్యుమరేషన్ ఫామ్‌‌‌‌ల పంపిణీని వంద శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే 7.8 శాతం మంది ఓటర్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫామ్‌‌‌‌లు సమర్పించగా, మొత్తం 25.5 శాతం ఫామ్‌‌‌‌ల వివరాలను డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 24.33 శాతం మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, మరణించిన ఓటర్లు ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించిన వారు మళ్లీ మ్యానువల్‌‌‌‌ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బీఎల్‌‌‌‌వోతోపాటు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ అందుకున్న వెంటనే నింపి సమర్పించాలని, చివరి రోజు వరకు వేచి ఉండవద్దని ఆయన సూచించారు. వచ్చే మూడు రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది తమ ఫామ్‌‌‌‌లను బీఎల్‌‌‌‌వోలకు అందించాలని కోరారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బీఎల్‌‌‌‌వోలు అందుబాటులో ఉంటారని, షిఫ్ట్‌‌‌‌ అయిన వారిలో ఇంకా ఎవరికైనా ఫామ్ అందని వారు ఉంటే తమ బీఎల్‌‌‌‌వో లేదా బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌‌‌‌ఏ)ను సంప్రదించాలని సూచించారు.

 ఓటర్లకు సహాయం చేసేందుకు జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసుతో పాటు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక హెల్ప్‌‌‌‌డెస్క్‌‌‌‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. బూత్ లెవల్ ఏజెంట్లు కూడా ఎన్యూమరేషన్ ఫామ్‌‌‌‌లను సేకరించి ప్రతిరోజూ 50 ఫామ్‌‌‌‌ల వరకు బీఎల్‌‌‌‌వోలకు అందజేయవచ్చని వివరించారు. ‘సర్‌‌‌‌‌‌‌‌’పై విస్తృత ప్రచారం చేపట్టామని, ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా నింపాలనే అంశంపై దశలవారీ వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. 

తప్పులుంటే ఫామ్‌‌‌‌–8 ద్వారా సవరణ

ఫామ్‌‌‌‌లలో ఏవైనా పొరపాట్లు ఉంటే ‘సర్‌‌‌‌‌‌‌‌’ పూర్తయిన తర్వాత ఫామ్–8 ద్వారా సవరణలు చేసుకోవచ్చని ఆర్వీ కర్ణన్‌‌‌‌ చెప్పారు. ఇప్పుడు పేర్లు ఎలా ఉన్నా కూడా ఫామ్స్ ఇస్తే ఓటు కోల్పోకుండా ఉంటుందన్నారు. ఆగస్టు 3 వరకు ఫామ్స్ అందివ్వవచ్చని,  ఆగస్టు 10న ఓటరు ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్ లిస్ట్) విడుదల చేస్తామని, ఫామస్‌‌‌‌ సమర్పించిన వారందరి పేర్లు అందులో ఉంటాయని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్‌‌‌‌ జాబితాలో ఉందో.. లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌‌‌‌లు ఉంటే  ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమర్పించాలని సూచించారు.  

డ్రాఫ్ట్‌‌‌‌ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్‌‌‌‌ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 లోపు ఎన్నికల నమోదు అధికారికి (ఈఆర్‌‌‌‌వో) సూచించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలని చెప్పారు. ఫైనల్ డ్రాఫ్ట్ అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్‌‌‌‌లో బీఎల్‌‌‌‌వోలపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 2002 ఓటరు జాబితా అందుబాటులో లేకపోవడంతో, ఆ ఓటర్లను ప్రత్యేకంగా పరిగణించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘సర్‌‌‌‌‌‌‌‌’కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1950 కి కాల్ చేయవచ్చన్నారు.