3 వేల ఆలయాల్లో బోనాల ఏర్పాట్లు : మంత్రి కొండా సురేఖ

3 వేల ఆలయాల్లో బోనాల ఏర్పాట్లు :   మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: బోనాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న సుమారు 3 వేలకుపైగా దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బోనాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. గతేడాది కంటే మిన్నగా ఈసారి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని, ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పోలీస్, మున్సిపల్, జలమండలి, విద్యుత్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.