జకర్తా: ఆసియా అండర్–19, 23 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్ల పంచ్ అదిరింది. బుధవారం జరిగిన విమెన్స్ 51 కేజీల ఫైనల్లో చంద్రికా భోరేష్ పూజారి 5–0తో నజోకత్ మర్దోనోవాన (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. మరో ఫైనల్లో ప్రాచీ.. దీరా ఆర్తికా (ఇండోనేసియా)పై ఏకపక్ష విజయం సాధించింది. అండర్–23లో 54 కేజీల ఫైనల్లో నిషా 5–0తో కోయిన్ కొకుపు (జపాన్)ను చిత్తు చేసి బంగారు పతకాన్ని సాధించింది. ఇతర కేటగిరీల్లో నికితా చంద్ (60 కేజీ), కాజల్ (65 కేజీ), ముస్కాన్ (75 కేజీ) తమ ప్రత్యర్థుల చేతిలో ఓడారు.
