గాలె: శ్రీలంక అండర్–19తో జరుగుతున్న యూత్ తొలి టెస్ట్‌లో ఇండియా అండర్–19 జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు లక్ష్య రైచందాని (196 బ్యాటింగ్), సాగర్ విర్క్ (134) సెంచరీలతో చెలరేగడంతో.. బుధవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 117 ఓవర్లలో 378/3 స్కోరు చేసింది. 186/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లక్ష్య, సాగర్ తొలి వికెట్‌కు 295 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు.
సాగర్ ఔటైన తర్వాత కుశాగ్ర ఓజా (24), యశబర్దన్ చౌహాన్ (6) నిరాశపర్చినా లక్ష్య సూపర్‌గా ఆడాడు. ఆట ముగిసే టైమ్‌కు లక్ష్యతో పాటు కుష్ పటేల్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. దుల్నిత్, లతేంద్ర, దిమత్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఇండియా ఇంకా 46 రన్స్ వెనకబడి ఉంది. లంక తొలి ఇన్నింగ్స్‌ను 424/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
