నర్సాపూర్, వెలుగు : కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను మెదక్ జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు.
గ్రామానికి చెందిన శివన్నగారి సుధాకర్‌గౌడ్ పాల పౌడర్, కెమికల్స్ ను ఉపయోగించి పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రదీప్కుమార్సైతం గ్రామానికి చేరుకోని 150 లీటర్ల కల్తీ పాలు, తయారీకి ఉపయోగించే రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పాలను టెస్ట్‌కోసం ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు. శివకుమార్గౌడ్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
