మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ శ్రీ జగదాంబ మహం కాళి (ఎల్లమ్మ తల్లి) బోనాల ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ డ్రైవర్షన్ చేశారు. 16, 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
గోల్కొండ కోటకు..
గోల్కొండ కోటకు..రాందేవ్ గూడ నుంచి మక్కాయ్ దర్వాజా మీదుగా.., లంగర్ హౌస్ నుంచి ఫతే దర్వాజా మీదుగా, షేక్‌పేట్‌నాలా సెవెన్ టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా మీదుగా, నార్సింగి, సన్ సిటీ, లంగర్ హౌస్ వైపు నుంచి మక్కాయ్ దర్వాజా మీదుగా మళ్లించనున్నారు. అలాగే షేక్‌పేట్, ఫిలింనగర్, గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను బంజారా దర్వాజా మీదుగా, లంగర్ హౌస్, బాలిక భవన్, నానల్ నగర్ వైపు మళ్లించనున్నారు.
దీంతోపాటు ఫిలింనగర్, షేక్‌పేట్ వైపు నుంచి బంజారా దర్వాజా, మక్కాయ్ దర్వాజా మీదుగా బంజారా దర్వాజా వెలుపల అల్జాపూర్ రోడ్, - నెక్నాంపూర్ వైపు, మొఘల్ కా నాలా వైపు నుంచి లంగర్ హౌస్, ఫతే దర్వాజా, గోల్కొండ కోట వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ ను లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద బాలికా భవన్, నానల్ నగర్ వైపు డైవర్ట్ చేయనున్నట్లు చెప్పారు.
పార్కింగ్ ఏర్పాట్లు
గోల్కొండ కోట బోనాల ఉత్సవాలకు వచ్చే వాహనాలకు పార్కింగ్‌ల ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాందేవ్ గూడా వైపు నుంచి మక్కాయి దర్వాజా మీదుగా వచ్చే భక్తులు ఆషూర్ ఖానా నుంచి ఆర్మీ సెంటర్ పోస్ట్ వరకు టూవీలర్లు, ఆర్టిలరీ సెంటర్ లో ఆటోలు, బస్సులు పార్కింగ్ చేయాలన్నారు. లంగర్ హౌస్ వైపు నుంచి ఫతే దర్వాజ మీదుగా వచ్చే వారు హుడా పార్కు, ఫతే దర్వాజా, ప్రైమరీ స్కూల్‌లో టూవీలర్లు, ఓవైసీ గ్రౌండ్ ఆటోలు కోసం కేటాయించారు.
షేక్‌పేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు హాకీ గ్రౌండ్, ఓవైసీ గ్రౌండ్, ఏరియా హాస్పిటల్, 7 టూంబ్స్ లో పార్కింగ్ చేయొచ్చు. గోల్కొండ కోట సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాలను ఈజీగా గుర్తించడానికి ఆయా మార్గాల్లో సైన్ బోర్డులపై గల క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవచ్చని ట్రాఫిక్ కమిషనర్ తెలిపారు. అవసరమైతే ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626 సంప్రదించాలన్నారు.
