గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి–మియాపూర్రోడ్డు రోజూ అత్యంత రద్దీగా ఉంటోంది. అయితే, ఈ రోడ్డులో కొత్తగూడ చౌరస్తా సమీపంలో ఉన్న శరత్‌సిటీ క్యాపిటల్మాల్ వద్ద నిత్యం ట్రాఫిక్జామ్ఏర్పడుతోంది. ఈ రూట్‌లో ట్రావెల్చేసే వారు మాల్‌వద్దకు వచ్చేసరికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మామూలు రోజుల్లో తక్కువ సమస్యే ఉన్నా వీకెండ్వచ్చిందంటే ఈ రూట్‌లో రావాలంటే వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గచ్చిబౌలి నుంచి బొటానికల్గార్డెన్జంక్షన్మీదుగా ఫోర్లైన్లలో వచ్చే వాహనాలు మాల్ముందుకు వచ్చేసరికి రెండు లైన్లలో వెళ్లాల్సి వస్తోంది. మాల్‌కు వచ్చేవారిని పిక్చేసుకోవడానికి, డ్రాప్చేయడానికి క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌లు రోడ్లపైనే నిలుపుతుండడం, మాల్లోపలి నుంచి బయటకు నిరంతరంగా వాహనాలు వస్తుండడంతో తీవ్రమైన ట్రాఫిక్జామ్ఏర్పడుతోంది.
రోజుకు లక్షన్నర వాహనాలు
ప్రతిరోజు గచ్చిబౌలి–మియాపూర్రూట్లో దాదాపు1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని గచ్చిబౌలి నుంచి కొండాపూర్వైపు ఫ్లైఓవర్, కొండాపూర్నుంచి బొటానికల్గార్డెన్జంక్షన్వైపు కొత్తగూడ జంక్షన్‌వద్ద అండర్పాస్నిర్మించారు. ఉదయం మియాపూర్ నుంచి వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని సింగిల్ వేగా ఉన్న ఫ్లైఓవర్‌పై రెండు వైపులా వాహనాలను అనుమతిస్తూ ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
వీకెండ్‌లో 3 లక్షల మంది
నగరంలో ఎక్కువ మంది విజిట్చేసే మాల్స్‌లో శరత్‌సిటీ మాల్ కూడా ఒకటి. వీకెండ్‌లో ఇక్కడకు లక్షల్లో జనాలు వస్తుంటారు. సైబరాబాద్పోలీసుల అంచనా ప్రకారం..మాల్‌కు సాధారణ రోజుల్లో 50 వేల నుంచి 60వేల మంది వస్తే, వీకెండ్స్‌లో ఈ సంఖ్య 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటోంది. పండుగవేళల్లో 3.5 లక్షలు దాటుతుంది. వీరితో పాటు మాల్‌లో 3,500 నుంచి 4,500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తుంటారు.
వీకెండ్స్‌లో లోపలి నుంచి వాహనంలో బయటకు రావాలంటే అరగంటకు పైగానే పడుతుంది. అంటే నాన్‌స్టాప్‌గా రోడ్డు మీదకు వాహనాల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో ఈ మాల్ముందు రోడ్డుపై నుంచి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌తో నరకం చూస్తున్నారు. బొటానికల్‌గార్డెన్ జంక్షన్‌నుంచి మాల్మీదుగా కొత్తగూడ జంక్షన్‌కు చేరుకోవాలంటే గంటలు పడుతోందని వాపోతున్నారు.
అండర్ పాస్‌కు నో..
ట్రాఫిక్సమస్య పరిష్కారానికి బొటానికల్గార్డెన్సిగ్నల్చౌరస్తా ఎడమ వైపు నుంచి మాల్‌లోకి డైరెక్ట్ అండర్పాస్పెట్టుకుంటామని మాల్నిర్వాహకులు అధికారులను కోరారు. దీనికి వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు అండర్ పాస్నుంచి మాల్‌కు వెళ్లే వాహనాల వల్ల ఆగిపోయే అవకాశం ఉంటుంది. మాదాపూర్, కొండాపూర్, హఫీజ్‌పేట్ నుంచి వచ్చే వాహనాలు ఈ సిగ్నల్దగ్గరే యూటర్న్ చేసుకుని అండర్‌పాస్ నుంచి వెళ్లాల్సి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని నో చెప్పారు.
ఇవీ అధికారుల ప్రతిపాదనలు
మాల్‌వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్సమస్యపై సైబరాబాద్మున్సిపల్కమిషనర్ సృజన, సీపీ రమేశ్, ఇంజినీరింగ్, ట్రాఫిక్ అధికారులతో కలిసి సమీక్షించారు. మాల్‌వద్ద ట్రాఫిక్పరిస్థితిని స్వయంగా చూశారు. రోడ్డుపైనే పికప్, డ్రాప్ఉండడం, మాల్లోపలి నుంచి బయటకు వచ్చే వాహనాలు ఈ రోడ్డుపైకే వస్తుండడంతో సమస్య ఏర్పడుతోందని గుర్తించారు. మాల్ఎంట్రన్స్నుంచి అపోజిట్రోడ్డు వరకు స్కైవాక్నిర్మించాలని ప్రతిపాదించారు.
దీంతో మాల్నుంచి బయటకు వచ్చే వాళ్లు రోడ్డుపై వేచి ఉండల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ స్క్కైవాక్ద్వారా అవతలి రోడ్డుకు వెళ్లి అక్కడి నుంచే వెళ్లిపోవచ్చు. పికప్, డ్రాప్కూడా అక్కడే ఉంటే సమస్య సగం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మాల్ముందున్న పికప్, డ్రాప్పాయింట్ను నేరుగా బి1 పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదించారు.
ట్రాఫిక్ తగ్గించేందుకు చర్యలు చేపట్టాం
శరత్‌సిటీ మాల్ వద్ద ట్రాఫిక్‌రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మాల్ ఎదురుగా క్యాబ్‌లు, ఆటోలు నిలిపితే చలాన్లు విధిస్తున్నాం. ట్రాఫిక్ నిలవకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాహనాలను మళ్లిస్తున్నారు. అయినా సమస్య తీవ్రత ఎక్కువగానే ఉంది. మాల్‌వద్ద ట్రాఫిక్‌రద్దీని పూర్తిగా నివారించేందుకు ప్రతిపాదనలు చేశాం..త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. – సురేశ్, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
