హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. బుధవారం ఈ అంశంపై తెలంగాణ జనసేన తరపున సీఎంకు లేఖ రాశారు. పోక్సో కేసుల దర్యాప్తు, బాధితుల రక్షణకు సంబంధించిన అనేక అంశాలపై ఆ లేఖలో పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు.
పోక్సో కేసుల దర్యాప్తు 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ‘‘బాధితులకు పూర్తి రక్షణ కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఈ కేసుల్లో బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయండి. పోక్సో కేసులపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో నెల వారీ సమీక్షలు నిర్వహించాలి”అని లేఖలో పవన్ పేర్కొన్నారు.
