ఎండాకాలం వచ్చిందంటే మనం అక్కడక్కడా అకస్మాత్తుగా కార్లలో మంటలు వచ్చి కాలిపోయాయన్న వార్తలు చదువుతూ ఉంటాం. ఈ నెలలో ఎండలు మండడం మొదలైందో లేదో అప్పుడే నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 42 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆ వేడికి ప్రయాణంలో ఉండగానే కార్లలోంచి పొగలు వచ్చి..నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమైపోతున్నాయి. కేవలం అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నా...ఇతర కారణాలు వీటికి దోహదం చేస్తున్నాయని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణం అని, మెయింటనెన్స్లేకపోవడం అగ్నికి ఆజ్యం పోస్తోందంటున్నారు. కారు ఇంజిన్, బ్యాటరీ, వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఎండ వేడి వాటిపై ప్రభావం చూపి కాలిపోతున్నాయంటున్నారు.
ఫ్యూయల్ లైన్‌లో చిన్న లీక్.. పెద్ద ప్రమాదానికి కారణం
ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారులో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే, ఇంజిన్ లో అది 60 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ టైంలో ఫ్యూయల్ లైన్‌లో చిన్న లీక్ ఉన్నా, ఆ ఆవిరి ఇంజిన్ దగ్గరకు చేరుతుంది. ఈ సమయంలో చిన్న స్పార్క్ కూడా పెద్ద మంటలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎండలు మండుతున్నప్పుడు ట్రాఫిక్‌లో మెల్లి మెల్లిగా ఆగుతూ వెళ్లే వాహనాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మెయింటనెన్స్లోపం..
ముఖ్యంగా పాత వాహనాలు, సర్వీస్ చేయని కార్లు ఎక్కువగా కాలిపోతున్నాయని తేలింది. వీటిల్లోనూ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని మెహిదీపట్నానికి చెందిన కార్మెకానిక్నవీన్చెప్తున్నారు. చిన్న సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయంటున్నారు. లీకేజీలు, లూజ్ వైర్లు ఉండడం..ఎండాకాలంలో వేడి పెరగడం ముప్పును పెంచుతాయని నిపుణులైన మెకానిక్‌లు అంటున్నారు. అందుకే కార్లు నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు వస్తాయని, ఎప్పుడూ రెగ్యులర్‌గా మెయింటనెన్స్చేయిస్తే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని అంటున్నారు.

