కడుపులో కత్తి గుచ్చుకొని సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి

కడుపులో కత్తి గుచ్చుకొని సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి

పంజాగుట్ట, వెలుగు : అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్​వేర్​ఉద్యోగి మృతి చెందిన ఘటన ఎస్సార్​నగర్​పరిధిలో జరిగింది. బల్కంపేటకు చెందిన సర్దార్​భగత్ సింగ్​కుమారుడు గురుప్రీత్​సింగ్​(26) ఐటీ ఉద్యోగం చేసేవాడు. ఇటీవల జాబ్​మానేశాడు. మంగళవారం అర్ధరాత్రి అమీర్​పేట్​కుమ్మరి బస్తీలో ఉన్న తన 

పెద్దనాన్న కుమారుడు బల్బీర్​సింగ్​వద్దకు వెళ్లాడు. మిద్దెపైకి వెళ్తుండగా, కిందపడి కంజర్​ కత్తి కడుపులో గుచ్చుకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.