పొలంలో వృషభనాథుడి విగ్రహం

పొలంలో వృషభనాథుడి విగ్రహం

గంగాధర, వెలుగుకరీంనగర్​జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లిలో మరోసారి జైనుల ఉనికి బయటపడింది. గ్రామానికి చెందిన ఒగ్గు అంజయ్య రెండేళ్ల క్రితం పొలాన్ని ట్రాక్టర్ తో దున్నుతుండగా 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహం బయటపడింది. తాజాగా శనివారం మొదటి తీర్థంకరుడు వృషభనాథుడి విగ్రహం బయటపడింది. జైనులు మత వ్యాప్తిలో భాగంగా 6వ శతాబ్ధం నుంచి 12వ శతాబ్ధం వరకు మండలంలోని కోట్ల నర్సింహులపల్లి, కొండన్నపల్లి ప్రాంతాల్లో సంచరించినట్టు తెలుస్తోంది. కొండన్నపల్లిలో 9వ శతాబ్ధానికి సంబంధించిన జైనుల ఆనవాళ్లు, కంద పద్యం ఉన్నాయి. ఆర్కియాలజి డిపార్ట్​మెంట్​అధికారులు గతంలో ఈ ప్రాంతాలను చాలాసార్లు సందర్శించి కొండన్నపల్లి, నర్సింహులపల్లి గుట్టలు, పరిసర ప్రాంతాలను చారిత్రక ప్రదేశాలుగా గుర్తించారు. తాజాగా అంజయ్య భూమిలో బయటపడిన దిగంబర వృషభనాథుడి విగ్రహం సుమారు 3 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవు ఉంది. తహసీల్దార్​ జింక జయంత్​ పార్శ్వనాథుడు, వృషభనాథుడి విగ్రహాలను సందర్శించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విగ్రహాలు 8, 9వ శతాబ్ధానికి చెందినవని చరిత్రకారులు చెబుతున్నారు.

కిరాయికుండెటోళ్లకు కరోనా కష్టాలు