రావణాసుర లాంటి కథ ఇప్పటివరకు తెలుగులో రాలేదు

రావణాసుర లాంటి కథ ఇప్పటివరకు తెలుగులో రాలేదు

స్వామిరారా, దోచేయ్, రణరంగం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మ.. రవితేజతో ‘రావణాసుర’ రూపొందించాడు. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. ఈ  సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమా సూపర్ ఎక్సయిటెడ్‌‌గా ఉంటుంది. థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ హైలైట్‌‌గా నిలుస్తాయి.  

రవితేజతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ ఉంది.  శ్రీకాంత్ విస్సా ఈ కథ చెప్పిన్నపుడు రవితేజకి  నచ్చి, దర్శకుడిగా నేనైతే బావుంటుందని ఆయనే నన్ను  పిలిచారు.   థ్రిల్లింగ్ సబ్జెక్ట్, అందులోనూ  పెద్ద హీరో చేయడంతో చాలా ఎక్సయిటెడ్‌‌గా అనిపించింది. ఇది వంద శాతం కొత్త జానర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. మణిరత్నం గారి ‘రావణ్‌‌’కు ఈ కథకు ఏం సంబంధం లేదు. 

ఇందులో  హీరో పాత్రకి రావణాసుర పేరు సూట్ అవుతుందని పెట్టాం తప్పితే నేను రామాయణంలోకి వెళ్ళలేదు. అయితే రావణాసుర అనే పేరు పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని డైలాగులు యాప్ట్ అయ్యాయి. ఇక త్రివిక్రమ్ కథతో పవన్ కళ్యాణ్‌‌ హీరోగా ఓ సినిమా చర్చల దశలో ఉంది. అది ఎప్పుడనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది’ అన్నాడు.