బషీర్‌బాగ్, వెలుగు: సూసైడ్ చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన ఓ స్టూడెంట్ను పోలీసులు వేగంగా స్పందించి కాపాడారు. హబ్సిగూడ ఒమేగా కాలేజీలో చదువుతున్న లకన్ అనే స్టూడెంట్ తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఫ్రెండ్‌కు చెప్పాడు. ఆమె పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే బ్లూ కోట్ సిబ్బంది మొబైల్ లొకేషన్ ఆధారంగా ఖాజా గరీబ్ నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ పై లకన్ ఉన్నట్లు గుర్తించి నిమిషాల్లో అక్కడికి వెళ్లారు. మూర్ఛావస్థలో ఉన్న యువకుడిని కాపాడి.. ఓ హాస్పిటల్‌కు తరలించారు.
