శ్రీశైలంలో ఏరో డ్రోమ్‌‌ ఏర్పాటుకు సర్వే

శ్రీశైలంలో ఏరో డ్రోమ్‌‌ ఏర్పాటుకు సర్వే

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం వద్ద కృష్ణానదిలో ఏరో డ్రోమ్‌‌ ఏర్పాటు కోసం బుధవారం ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ వరకు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఏరో డ్రోమ్‌‌ ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రాజెక్ట్‌‌ వరకు ఏరో డ్రోమ్‌‌, సీ -ప్లేన్‌‌ వస్తే ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆఫీసర్లు చెప్పారు. 

ఏరో డ్రోమ్‌‌ ఏర్పాటు వల్ల శ్రీశైలానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్‌‌లో కూడా ఏరోడ్రోమ్‌‌  ఏర్పాటుకు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేలో ఏరోపోర్ట్‌‌ మేనేజర్‌‌ అమృత్‌‌కుమార్‌‌, పర్యాటక శాఖ జీఎం నాగేశ్వర్‌‌రావు, డీఎం చంద్రమౌళిరెడ్డి, ఫిషరీశ్‌‌ జేడీ రాఘవరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ సీఈ శ్రీరామచంద్రమూర్తి, అటవీ శాఖ రేంజర్‌‌ నరసింహులు పాల్గొన్నారు.